సార్వత్రిక ఎన్నికల దగ్గరకి వచ్చే కొద్ది ఏపీలో అధికార పార్టీ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కొద్ది రోజులుగా ఊహించని వ్యూహాలతో రాజకీయవర్గాల్లో హీట్ పెంచుతూ అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. వరుసగా పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీలోకి ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. ఫ్యాన్ గాలి జోరుగా వీయబోతోందని సర్వేలన్నీ చెబుతుండడంతో ఏపీ ప్రధాన ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ వైపు టీడీపీ నేతలు ఆకర్షితులవుతున్నారు. మొన్న ఆమంచి, అవంతి, రవీంద్ర బాబు ఇలా వరుసగా వైసీపీలోకి చేరిపోయారు. ఇప్పటికే వరుసగా టీడీపీ సిట్టింగ్ నేతలు వైసీపీలో చేరడంతో మరి కొంతమంది నేతలు పార్టీ చేరుందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా వైసీపీ ముఖ్యనేతలతో పలువురు టీడీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే జగన్ లండన్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఏపీలో హైటెన్షన్ పొలికర్ డ్రామాకి బ్రేక్ పెట్టి, తన కూతురును చూడడానికి లండన్ వెళ్ళారు జగన్. ఆయన కూతురు లండన్‌లో ప్రముఖ విద్యా సంస్థలో చదువుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 26 వరకు అక్కడే ఉంటారు. లండన్ నుంచి జగన్ రాగానే 5 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరాడానికి అన్ని విధాలుగా రంగం సిద్దం చేసుకునట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి వైసీపీలో చేరుతున్న మరో 5 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరనదే..!
