ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఏ రాష్ట్రంలోనైన ఎన్నికలు వస్తున్నాయి అంటే నేతలు ఆ పార్టీ నుండి ఈ పార్టీకి ఇందులో నుండి వేరేదానికి వెళ్ళడం సహజమే.కాని ఏపీలో మాత్రం ఒక్కటే జరుగుతుంది.టీడీపీ నాయకులు ఒక్కొక్కరుగా వైసీపీ గూటిలోకి చేరుతున్నారు.దీనితో తనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని బాబుకు అర్ధమైనట్లుంది.అయితే ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు,ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కండువ కప్పుకున్నారు.దీనిబట్టే వైసీపీ మంచి జోష్ మీద ఉన్నట్టు తెలుస్తుంది.ఇది ఇలా ఉండగా తాజాగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీకి భారీ షాక్ ఇచ్చాడు.మోదుగుల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో గుంటూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది.ఆయన రాజీనామా చేస్తాడని ఎప్పటినుండో అనుకున్నదే..రావెల కిషోర్ బాబు టీడీపీ నుండి బయటకు వచ్చినప్పుడే మోదుగుల కూడా రాజీనామా చేస్తారని అనుకున్నారు.ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో మోదుగుల వైసీపీ తరుపున పోటీ చేయటం ఖాయమనే అనుకోవాలి.
2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలను,ముగ్గురు ఎంపీలను చంద్రబాబు టీడీపీలోకి లాక్కుని వారిలో నలుగురిని మంత్రులను చేసాడు.అయితే జగన్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చాలా తేడా కనిపిస్తుంది.టీడీపీ నుండి వైసీపీకి వస్తున్న ఎమ్మెల్యేలను,ఎంపీలను వారి పదవులకు రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటున్నారు.ఇక్కడే అర్ధమవుతుంది వారిద్దరి మధ్య తేడా ఏంటో.