భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని దేసమంతటా తీవ్రంగా ఖండిస్తుంటే..ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం దీనిని రాజకీయం చేస్తున్నారు.ఓ పక్క అందరు పాకిస్తాన్ పై యుద్ధం చెయ్యాలని అంటుంటే..బాబు మాత్రం ఇవ్వన్ని వదిలేసి మోదీని రాజీనామా చేయమంటున్నరు.ఏ సమయంలో ఏది మాట్లాడాలో చంద్రబాబుకి తెలియడం లేదు.అయితే ఈ విషయం తీవ్రంగా కండించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.గతంలో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు కారణంగా అన్యాయంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.అయితే ఉగ్రదాడుల కారణంగా 40మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా దీనికి ప్రధాని మోదీని చంద్రబాబు రాజీనామా చేయమంటున్నారు..అలాగైతే మీ సొంత ప్రయోజనాలు కోసం అన్యాయంగా 30 మంది ప్రాణాలు బలిగొన్న మీరెందుకు రాజీనామా చేయలేదని రోజా ప్రశ్నించారు.
రాజకీయ అవసరాల కోసం అన్ని రాష్ట్రాలు తిరుగుతున్న బాబు..అమరావతికి 50 కిమీ దూరంలో ఉన్న గ్రామానికి ఇంత హంగామా అవసరమా అని మండిపడ్డారు.చంద్రబాబు మీటింగ్ పేరుతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు.ఈ కోటయ్య మృతికి సంబంధించి ఏ ప్రశ్నలకు సమాధానం లేదు.మరి ఇప్పుడెందుకు రాజీనామా చేయలేదని ధ్వజమెత్తారు.చంద్రబాబు తనకో లెక్క.. వేరేవాళ్ళకో లెక్క అన్నట్టుగా వ్యవహరిస్తారని ఎద్దేవా చేశారు.