కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి పంట పండినట్లేనా? అవుననే అనిపిస్తుంది..ఎందుకంటే సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ప్యాకేజీ ఇవ్వనుంది.తన కుటుంబం జీవితాంతం కర్చుపెట్టినా తరగనంత సొమ్ము మరియు పదవులు ఆఫర్ చేసాడట చంద్రబాబు.కోట్ల టీడీపీకీ వస్తే అతనికి ఎంపీ,భార్య సుజాతకు ఆలూరు లేదా డోన్ అసెంబ్లీ టిక్కెట్,తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి బాబు ఒప్పందం కుదిర్చుకున్నట్టు సమాచారం.సుజాత డోన్ నియోజకవర్గం నుండి పోటీ చెయ్యాలని కోరగా అక్కడ నుండి కేఈ ఫ్యామిలీ కూడా చంద్రబాబుని పట్టుబడుతున్నారు.
అయితే తన తండ్రి ఐన మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డికి చంద్రబాబు అంటే ఎంత మాత్రం నచ్చేది కాదు.కాని అయన కుమారుడు డబ్బుకు ఆశపడి చంద్రబాబుతో బేరం కుదుర్చుకున్నాడు.ఈనెల 28న జిల్లాలోని కోడుమూరులో బహిరంగ సభలో కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరనుంది.