రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావును నియమించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే దయాకర్ రావు రేపు మంత్రిగా బాధ్యతలు స్వికరించనున్నారు.ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భేటీ అయ్యారు . పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్,ఆర్ డబ్యూఎస్ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎంతో నమ్మకం ఉందని అన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయ్యకుండా అందరం కలిసి పనిచేద్దామని సూచించారు. లోక్సభ ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని చెప్పారు. నిధుల దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ విజన్ మేరకు బంగారు తెలంగాణ సాధన దిశగా పని చేయాలన్నారు.