కొండవీడులో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కోటయ్య అనే రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే.కోటయ్య మరణం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ దిగ్ర్భాంతి గురయ్యారు.ఈ దారుణానికి కారణమైన చంద్రబాబుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తన పంట నాశనం చేయొద్దని బ్రతిమిలాడిన పట్టించుకోకుండా అన్యాయంగా ఆ రైతుపై దాడి చేసారని ఆరోపించారు.ఈ మేరకు అందుబాటులో ఉన్న నాయకులతో జగన్ అత్యవసరంగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో రైతు కోటయ్య మరణంపై చర్చించారు.అసలు ఏం జరిగింది అనే అంశంపై శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు వైఎస్ జగన్.ఈ కమిటీ ఈరోజు కొండవీడులో పర్యటించనుంది.చంద్రబాబు కి రైతులపై ఎందుకు ఇంత కోపం ఎందుకు ఇంతలా దిగజారారు అంటూ జగన్ విమర్శించారు.సీఎం సభ కోసం రైతును చంపేశారు అని చెప్పుకొచ్చారు.