సూపర్ స్టార్ మహేష్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.రంగరెడ్డి జిల్లా అధికారులు మహేశ్ బాబుకు షోకాజ్ నోటీసులు పంపించారు.అసలు విషయానికి వస్తే సూపర్ స్టార్ గచ్చిబౌలిలో ఎఎంబీ సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ థియోటర్‌ను ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే.దీనిని భారీ ఎత్తున నిర్మించాడు.అయితే ఎఎంబీ సినిమాస్ జీఎస్టీ రూల్స్ పాటించడంలేదనే ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు.నిన్న జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ వింగ్ అధికారులు కొన్ని మల్టీప్లెక్స్‌లకు వెళ్లి టికెట్లను సేకరించారు.ఎఎంబీ లో టికెట్స్ పరిశీలించిన అధికారులు ఇవి పాత రేట్ల ప్రకారమే అమ్ముతున్నరనే అభియోగంతో అధికారులు అతనికి షోకాజ్ నోటీసులు పంపించారు.అంతే కాకుండా ఈ మేరకు మహేశ్ బాబుపై కేసు కూడా నమోదు అయ్యేలా ఉందని సమాచారం.ప్రిన్స్ ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక 25వ సినిమా షూటింగ్లో ఉన్నారు.అయితే ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఇంకా తెలియాలి.
