ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఏపీలో ప్రతిపక్ష వైసీపీకే అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి.వచ్చిన అన్ని సర్వేల్లోనూ ఆంధ్రలో ఫ్యాన్ గాలే వీస్తుందని చెబుతున్నాయి.జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది.కొన్ని నెలల ముందుతో పోలిస్తే వైసీపీ అధినేత జగన్ గ్రాఫ్ మరింత పెరిగిందని చెప్పింది.అప్పుడు జగన్ కు 43శాతం మంది మద్దతు తెలపగా ఈ ఏడాది ప్రస్తుత ఫిబ్రవరిలో ఇండియా టుడే సర్వే చేయగా 2శాతం పెరిగి 45కు చేరింది. ఈ క్రమంలోనే ప్రస్తుత సీఎం చంద్రబాబు గ్రాఫ్ రెండు శాతం తగ్గిపోయిందని ఈ సర్వే వివరించింది.ఈ ప్రకారం టీడీపీకి గత సెప్టెంబర్ లో 38శాతం ఉండగా ఇప్పుడు 36శాతానికి పడిపోయిందని సర్వే తేల్చింది.దీంతో ఏపీలో ప్రజలు 45శాతం జగన్ కు మద్దతు ఇవ్వగా..36శాతం చంద్రబాబుకు మద్దతు ఇచ్చారని ఇండియా టుడే సర్వే ప్రకటించింది.వీరిద్దరి మధ్య 9శాతం వ్యత్యాసం ఉందని చెప్పారు.
ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఏపీ ప్రజలు గతేడాది 5శాతం మద్దతు ఇవ్వగా..ప్రస్తుతం అది కాస్త 4శాతానికి పడిపోయింది.ఇక ఇతరులకు 15శాతం మంది ప్రజలు మద్దతు తెలిపినట్టు తమ సర్వే లో తేలిందని ఇండియా టుడే చెప్పింది.అన్ని సర్వేలు వైసీపీకే సపోర్ట్ గా ఉండడంతో ఇక విజయం కాయమని అనుకుంటున్నారు.అప్పటి 2014 ఎన్నికల్లో టీడీపీ – వైసీపీల మధ్య ఓట్ల శాతం అత్యల్పం.కాని ఈసారి మాత్రం భారీ తేడాతో జగన్ గెలుస్తాడని ఇండియా టుడే అభిప్రాయపడింది.
సర్వే వివరాలు:
వైఎస్ఆర్సీపీ-45%,
టీడీపీ-36%,
జనసేన-4,
ఇతరులు-15%