నేను ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే ఎవరికి చెబుతానో తెలుసా అంటోంది నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఈ అమ్మడిని డేరింగ్ అండ్ డైనమిక్ నటి అని పేర్కొనవచ్చు. నటిగానే కాకుండా నిజ జీవితంలోనూ చాలా బోల్డ్ వరలక్ష్మీ శరత్‌కుమార్. ఏ విషయానైన్నా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం వరలక్ష్మీ నైజం. హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసి, గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూస్తూ కూర్చుంటే ఈ జాణ ఇంత పేరు తెచ్చుకునేది కాదేమో. నాయకి, ప్రతినాయకి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకుని నటించేయడంతో ఇప్పుడు కోలీవుడ్‌లోనే బిజీయస్ట్ నటిగా మారింది. సండైకోళీ–2, సర్కార్ వంటి చిత్రాల్లో విలనిజంలో దుమ్మురేపిన వరలక్ష్మీశరత్‌కుమార్‌పై వదంతులు చాలానే ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడు నటుడు విశాల్‌తో చెట్టాపట్టాల్ అంటూ ఈ మధ్య వరకూ జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇటీవల విశాల్‌కు హైదరాబాద్‌కు చెందిన అనీషా అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ కావడంతో ఆ వార్తలకు పుల్‌స్టాప్ పడింది. కాగా నటి వరలక్ష్మీ తాజాగా మరో సంచలనానికి తెర లేపింది. ఈ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో తెలుగు నటుడు ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం అని, నేను ఎవరికైనా ఐలవ్యూ చెప్పాలనుకుంటే అది బాహుబలి ప్రభాస్‌కే చెబుతానని అని మరోసారి వార్తల్లోకి ఎక్కింది.