వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని వైయస్ జగన్ నివాసంలో కృపారాణి, ఆమె భర్త జగన్ ను కలిసి మాట్లాడారు. ఇటీవల వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలుసలు అధికమయ్యాయి. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబులు వైయస్ జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరగా తాజాగా కిల్లి కృపారాణి దంపతులు వైయస్ జగన్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వెల్లడించారు. ఈనెల 28న అమరావతిలో పార్టీలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్టు తెలిపారు.
వైఎస్ జగన్‌ను సీఎం చేయడానికి కృషి చేస్తానని బీసీ గర్జనలో జగన్ ఇచ్చిన హామీలను పూర్తిగా విశ్వసిస్తున్నానన్నారు. చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేస్తారు జగన్ మాట తప్పరు, మడమ తిప్పరని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చారని, ఏపీ ప్రజలు ఆయన మాటలు విశ్వసించరని అన్నారు. కాంగ్రెస్, టీడీపీతో కాంగ్రెస్ పొత్తును తాను తీవ్రంగా వ్యతిరేకించానని రాహుల్ గాంధీకి లేఖ కూడా రాశానని వెల్లడించారు. ఇంకా చాలామంది వైసీపీలోకి వస్తారన్నారు. బీసీలను, కులవృత్తుల వారిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. టిక్కెట్ ఆశించి రాలేదని, భేషరతుగా వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్టు కృపారాణి స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే కిల్లి కృపారాణి వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్టు దరువు గతంలోనే వెల్లడించింది.
అతి త్వరలోనే వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి..!