తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.ఈ మధ్యకాలంలో తరచుగా విషాద సంఘటనలు జరుగుతున్నాయి.మొన్న బుల్లితెర నటి ఝన్నీఆత్మహత్య, నిర్మాత జయ కూడా ఇటీవలే చనిపోయారు.తాజాగా టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొనింది.టాలీవుడ్ సీనియర్ నటుడు డి.యస్.దీక్షితులు గారు కన్నుమూశారు. షూటింగ్ జరుగుతుండగానే ఒక్కసారిగా నేలకొరిగారు.వెనువెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా మార్గామధ్యలోనే మరణించినట్లుగా డాక్టర్లు తెలిపారు.
ఈయన వయస్సు60 ఏళ్ళు.ఎందులోనైన పూజారి పాత్రల్లో నటించి అందరి మన్నలను అందుకున్నారు.అప్పట్లో మురారి సినిమాలో ఆయన పూజారిగా నటించగా ఆ పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది.ఆగమనం అనే సీరియల్ కు గాను అతని నటనకు నంది అవార్డు వచ్చింది. ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, ఎల్లమ్మ, మురారి, అతడు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.