ఏపీలో టీడీపీకి మరో ఎంపీ జలక్ ఇవ్వనున్నారు. ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయత్ర ముగియాగానే అధికార టీడీపీ నుండి, ఇతర పార్టీల నుండి భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలు పార్టీ మారుతుండటంతో చంద్రబాబుకు ఏం జరుగుతుందో అర్థం కావాడం లేదంట. ఎవరు ఎప్పుడు వైసీపీలోకి చేరుతారో టెంక్షన్ మొదలైయ్యిందంట. ఇప్పటికే కీలకమైన కడప జిల్లాలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరగా.. మొన్న ప్రకాశంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి… నిన్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరిపోయారు.తాజాగా నేడు అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. మరోసారి పోటీకి టీడీపీ ఆయనకు స్పష్టత ఇవ్వకపోవడంతో వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆయన కాసేపట్లో వైసీపీ అధినేత జగన్‌ను కలవబోతున్నారు.
