శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. కాని అప్పుడు జరగలేదు ప్రస్తుతం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో విజయ్ఖాయమని తెలుసుకోని భానీగా అందరు గత నెల నుండి వలస వస్తున్నారు. ఇక ఇదే మంచి తరుణమని కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారట. డాక్టర్ అయిన కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీ తరుపున 2004 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఎంపీగా పోటీచేసి ఓడిపోయింది. ఆ తరువాత 2009 జరిగిన ఎన్నికలలో నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన కింజరాపు ఎర్రన్నాయుడు పై భారీ మెజారిటీతో గెలిచింది. ఆ క్రమంలో కేంద్ర సమాచార మరియు టెలీకమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత. నిజానికి కిల్లి కృపారాణి వైసిపిలో చేరబోతున్నట్లు సుమారు 10 నెలల క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా వైసీపీలో చేరికపై జగన్తో చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే సీటు విషయంలో ఇంకా క్లారిటీ రాని కారణంగానే కృపారాణి వైసీపీ తీర్ధం పుచ్చుకోవటం ఆలస్యమౌతోందనే టాక్ వినిపిస్తోంది. టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో ఎక్కడి నుండి అయిన కృపారాణి ఏదో ఒక దానిలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు కృపారాణి ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కృపారాణి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుటారని చెబుతున్నారు.
