యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరిది. మహానటుడు నందమూరి తారక రామరావు ఫ్యామిలీ నుంచి వచ్చిన నట వారసుడిగా… ఓ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ రైటర్.. మొదట్నుంచీ తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకే మద్దతు ప్రకటించారు. అయితే, కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరిగినా… ఈ హీరో ఆసక్తి చూపలేదు.
తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసంలో జగన్‌తో ఆయన భేటీ కావడం సంచలనం రేపుతోంది. ఎపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీ మద్దతుదారుడైన జూనియర్ ఎన్టీఆర్ మామ.. జగన్‌ను కలవడం రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశానని నార్నె చెబుతున్నప్పటికీ.. తాజాగా అధికార పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో వీరి భేటీ పొలిటికల్‌గా హీట్‌ను పెంచుతోంది. 2014 ఎన్నికల సమయంలోనూ నార్నె శ్రీనివాసరావు, జగన్‌ను కలిశారు. వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగినా అలా జరగలేదు. మరి ఈసారి ఏం జరుగుతోంది చూడాలి.