మంగళవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో రాజకీయవర్గాల్లో అనేక పేర్లపై చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికి ఎనిమిది లేక తొమ్మిది మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. పాత, కొత్త నాయకుల మిశ్రమంగా మంత్రివర్గం ఉంటుందని చెప్తున్నారు. కొందరిని ఇప్పుడు తీసుకుని, పార్లమెంటు ఎన్నికల తర్వాత మరికొందరికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గాన్ని కూర్పు చేస్తారని భావిస్తున్నారు.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం జిల్లాల వారిగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, కరీంనగర్ నుంచి కొప్పుల ఈశ్వర్, వరంగల్ నుంచి, ఎర్రబెల్లి దయాకర్ రావు, నల్గొండ నుంచి జగదీష్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి ప్రశాంత్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు చాన్స్ దక్కవచ్చంటున్నారు.