ప్రస్తుత రోజుల్లో అబ్బాయిలకు ఏ మాత్రం తీసీపోము అన్నట్టు ప్రవతిస్తున్నారు అమ్మాయిలు.వాళ్ళలానే మద్యం సేవిస్తున్నారు మరియు సిగరెట్ కూడా కాలుస్తున్నారు.ఇది అందరికి అలవాటు అయిపొయింది.కాని అంతకుమించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.అదేమిటి అనుకుంటున్నారా ఇప్పటివరకు అమ్మయిలు పబ్స్ లేదా హాస్టల్స్ లో తాగడం చూసుంటారు కాని ఇప్పుడు ఏకంగా ధైవంగా పూజించే పాఠశాలలో మద్యం తాగి హడావుడి చేసారు.ఇదంతా ఇద్దరు విద్యార్థినులు శనివారం విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామంలోని ఓ పాఠశాలలో వాళ్ళ క్లాసు రూమ్ లో చేసారు.
ఈ విషయం కొంచెం ఆలస్యంగా బయటకు వచ్చిన మేటర్ మాత్రం గట్టిదే.9వ తరగతి చదువుతున్న ఈ బాలికలు తమతో తెచ్చుకున్న మద్యంను తరగతి గదిలో తాగగా మైకంలో తోటి విద్యార్థులపై అనుచితంగా దాడి చేసారు.అయితే ఈ విషయంపై విద్యార్ధులు ప్రిన్సిపాల్ కి చెప్పగా..సురేష్‌కుమార్ వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి అక్కడే వైద్యుడి సమక్షంలో బాలికలు మద్యం సేవించారని నిరూపించారు.బాలికలకు తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహించారు.వీరి ప్రవర్తన తోటి విద్యార్ధులకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇద్దరికి టీసీలిచ్చి పంపించేసారు.