చిరుగుపాటి జయరాం హత్య కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతుంది. ఈకేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి చాలా సెటిల్మెంట్ చేసేవాడట.. పోలీసులు ఈ లావాదేవీలపై ఫోకస్ చేశారు.. దీంతో ఈ కేసులో మరికొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోలీసుల సాయంతో భూదందాలు, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల తేలింది. ఇతను భారీగా సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని, సెటిల్మెంట్‌కు పోలీస్‌లకు భారీగా నజరానాలు ఇచ్చేవాడని అధికారులు చెబుతున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, శేరిలింగంపల్లి, హయత్‌నగర్, ఆదిభట్ల, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రాకేష్ రెడ్డి పెద్దఎత్తున సెటిల్మెంట్లు చేసినట్టు, రియల్ ఎస్టేట్ దందా పేరుతో పలువురు వ్యాపారులకు రాకేష్ టోకరా ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఖాళీ స్థలాలపై వివాదాలు సృష్టించటం పోలీసుల సాయంతో బెదిరింపులకు దిగేవాడని చెబుతున్నారు. 11 మంది పోలీస్ అధికారులతో రాకేష్‌రెడ్డికి సంబంధాలు ఉన్నట్టు విచారణ అధికారులు గుర్తించారు. జయరామ్‌ను హత్య చేసిన విషయాన్నిమొదట రాయదుర్గం సీఐ రాంబాబుకు తెలియజేయగా హత్య జరిగిన ప్రాంతం తన పరిధిలోకి రాదని జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందిస్తానని చెప్పినట్టు అధికారులు తెలిపారు. అయితే జూబ్లీహిల్స్ పోలీసులను బురిడీ కొట్టించి రాకేష్ రెడ్డి పరారైనట్టు వార్తలు వస్తున్నాయి.