వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు బీసీ గర్జన వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. మాట ఇచ్చాక మాట తప్పనని బీసీలకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేరుస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్బంగా జగన్ ఇచ్చిన హామీలు ఆయన మాటల్లోనే
• బీసీల సంక్షేమానికి ఏటా రూ. 15 వేల కోట్లు వెచ్చిస్తాం
• 5 ఏళ్లలో రూ. 75 వేల కోట్లు ఖర్చు చేస్తాం• బీసీ సబ్ ప్లానుకు చట్ట బద్ధత కల్పిస్తాం
• మొదటి బడ్జెట్ లో సమగ్ర బీసీ చట్టాన్ని తీసుకుని వస్తాం
• మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాం
• కార్పొరేషన్ల వ్యవవ్థను ప్రక్షాళన చేస్తాం
• అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం
• నా రజకులు, చేనేత, మత్స్యకారులు, బోయలు, వాల్మీకులు, అగ్రికుల క్షత్రియులు, శాలివాహన,. దూదేకుల కొప్పుల, వెలమ, శెట్టి బలిజ, గాండ్ల, ముదిరాజ్ భట్రాజు వంటి బీసీ కులాలకు మొత్తం 139 కార్పొరేషన్లు ప్రారంభిస్తాం.
• ఏ ఒక్క సామాజిక వర్గాన్ని నిరర్లక్ష్యం చేయబోము.
• పారదర్శకంగా ప్రతి అక్కకు 45-60 ఏళ్ల వయసు మహిళలకు రూ. 75 వేలు వైయస్ఆర్ చేయూత పథకం కింది నాలుగు విడతలు ఉచితంగా ఇస్తాం.
• బీసీ విద్యార్థుల విద్య కోసం రూ. 20 వేలు
• బీసీ పిల్లలను బడికి పంపితే ఏటా రూ.15 వేలు ఇస్తాం
• కమిటి, నివేదిక లేకుండా 32 కులాలను మోస్ట్ బీసీలుగా గుర్తించారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ కమిషన్ ఏర్పాటు.
• కాలపరిమితి నిరంతరం పని చేసేలా పరిధిని విస్తరిస్తాం.
• శావ్వత ప్రాతిపదికపై బీసీ కమిషన్ ఉంటుంది.
• సర్టిపికెట్లు, కులాల కెటగరీల మార్పు గురించి ఈ కమిషన్ పని చేస్తుంది.
• హేతుబద్ధంగా బీసీ కమిషన్ పని చేస్తుంది.
• రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ఉండి పని చేసే కమిషన్ ఇది
• బీసీ కమిషన్ పారదర్శకంగా పని చేస్తుంది.
• బీసీ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తాం
• ఎస్సీ, ఎస్టీలుగా మార్చే విషయాలను సీరియస్‌గా తీసుకుంటాం.
• అసెంబ్లీ కూడా తీర్మానాలు చేసి కేంద్ర అనుమతికి పంపుతాం.
• బీసీ ఓట్ల కోసం ఈ విషయాలను మీముందు చెబుతున్నా నిజాయితీగా
• 31 బీసీలు ఓబీసీ కెటగిరిలో లేనందున ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారు
• నాలుగు సంవత్సరాలు బీజేపీతో అంట కాగిన చంద్రబాబు ఇప్పటి దాకా గాడిదలు కాశారా?
• ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రాలేదు? ఎందుకు లేఖ రాయలేదు?
• తెలంగాణలో బీసీ జాబితాల నుంచి తొలగించిన 32 బీసీలను తిరిగి బీసీలుగా గుర్తించేలా ఒత్తిడి తెస్తాం.
• హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకొని కేటీఆర్‌తో పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడుతారు కానీ బీసీల ఊసెత్తరు
• తెలంగాణ బీసీల గురించి కేసీఆర్‌తో మాట్లాడుతా
• ప్రయివేటు కాంంట్రాక్టు పనులు.. అవుట్ సోర్సింగ్ పనులు..
• 50 శాతం ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు, బీసీలకే వర్తిచేలా కొత్త చట్టం
• బీసీ కుల వృత్తిదారులు.. చిరువ్యాపారులకు ..గుర్తింపు కార్డులిచ్చి ..
• ఎపుడు అవసరం అయితే అపుడు వారికి సున్నా వడ్డీకే రూ పది వేలు రుణం
• బీసీ రాజకీయంగా బలపడటానికి అన్ని నామినేటెడ్ పదవులు..అన్ని నియామకాలకు ..
• ఈ కమిటీలలో 50 శతం ఎస్సీ, ఎస్‌టీ, మైనారిటీ, బీసీలకే ప్రాతినిధ్యం
• నామినేటెడ్ పనులలో కూడా 50 శాతం రిజర్వేషన్లు బలహీనవర్గాలు, బీసీలకే
• నాయీ బ్రాహ్మణుల దుకాణాలకు ఏటా రూ. పది వేలు సాయం
• సంచార జాతులకు ఉచితంగా ఇళ్లే కాదు ఉపాధి సదుపాయం కల్పిస్తాం.
• ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం
• వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ 10 వేల ఇస్తాం
• వేటకు వెళ్ళి చనిపోతే రూ. పది లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తాం
• చేనేతలకు నెల నెలా రూ. రెండు వేల పెట్టుబడి కింద ఇస్తాం
• యాదవుల గొర్రెలు, మేకలు చనిపోతే రూ ఆరు వేలు ఇస్తాం.
• బ్రాహ్మణులకు కనీస వేతనం కల్పిస్తాం.
• దేవాలయాల ట్రస్టీలుగా యాదవులు, నాయీ బ్రాహ్మణులను నియమిస్తాం.
• పేదలు ఆత్మహత్య అకాల మరణం చెందినా ..ఎస్సీ,ఎస్టీ, బీసీ, కావచ్చు వారిందరికీ బీమా పథకం కింద రూ. 7 లక్షలు ఇస్తాం
• ఈ డబ్బును ఆడపడుచు కట్నం కింద ఇస్తున్నాం .
• అందుకు ఓ కొత్త చట్టం తీసుకుని వస్తాం.
• బీసీలను వెన్నెముకగా తీర్చి దిద్దుతాం
• ఒక సారి అధికారం ఇస్తే మీకు మంచి చేస్తా