వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 2016 డిశంబర్ 16న ఒక మాట ఇచ్చారు.. ఒక పబ్లిక్ మీటింగ్ లో ప్రజల ముందు.. ఆమాట ఏమిటంటే జంగన్న నా తండ్రి చనిపోయిన తర్వాత నాకు తండ్రిలా అండగా నిలబడ్డారు.. ఆయన గురజాల ఎమ్మెల్యే టికెట్ మహేష్ కు ఇస్తున్నాను.. ఎట్టి పరిస్థితుల్లో జంగన్నకు అన్యాయం జరగనివ్వను అంటూ మాటిచ్చారు. మళ్లీ 2019 ఫిబ్రవరి 17న ఇదే అంశంపై జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు వైయస్ జగన్ ప్రకటించారు.
జననేత నిర్ణయంతో, జగన్ బీసీలకు ఇచ్చిన హామీల పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జగన్‌ను అభినందనలతో ముంచెత్తారు. సభా ప్రాంగణమంతా జై జగన్.. జోహార్ వైయస్ఆర్.. కాబోయే సీఎం జగన్ అంటూ పెద్ద పెట్టున నినదించారు. ఇదే సమయంలో జగన్ గుణాన్ని చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.. ఇదే స్థానంలో చంద్రబాబు ఉంటే అసలే మనం ప్రతిపక్షంలో ఉన్నాం అంటూ అదే ఎమ్మెల్సీ పదవిని వేలం వేసి పారిశ్రామిక వేత్తలకు అమ్మేసే వాడంటూ పెద్దఎత్తున వైసీపీ శ్రేణులు ఈ ఘటననుద్దేశించి విమర్శలు గుప్పిస్తున్నారు.