అరుదైన నాయకుడు, ధైర్యం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కొనియాడారు. ఈ రోజు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని కేటీఆర్ తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటినట్లుగా చెప్పారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండు జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు.కేసీఆర్ పుట్టిన రోజున పార్టీ కార్యకర్తలు గానీ, కేసీఆర్ అభిమానులు గానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఒక మొక్కనాటాలని ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ ప్రగతిభవన్ లో ఎమ్మెల్యే కేటీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ సతీమణి శోభ, ఎంపీ సంతోష్ కుమార్ లు మొక్కలు నాటారు.
Each of my family members planted a sapling wishing Sri KCR Garu a long, healthy, happy life filled with peace and love?
Many wishes to a rare leader & a fighter who personifies courage, commitment & grit. Proud that he is also my father ?#EachOnePlantOne#HappyBirthdayKCR pic.twitter.com/rsgZID0gst
— KTR (@KTRTRS) February 17, 2019
అనంతరం జూబ్లీహిల్స్ సీఆర్‌పీఎఫ్ కార్యాలయంలో అమర జవాన్లకు కేటీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. కేటీఆర్ స్నేహితులు కూడా మరో రూ.25లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. రూ.50లక్షల చెక్కును సీఆర్‌పీఎఫ్ ఐజీ జీహెచ్‌పీ రాజుకు కేటీఆర్ అందజేశారు.
It was my privilege & honour to visit the HQ CRPF southern sector & offer tributes to #PulwamaMartyrs ?
As a token of my respect, in my personal capacity handed over cheque of ₹25 lakhs & also ₹25 lakhs from few friends who volunteeredhttps://t.co/s2Feq9W3C2 pic.twitter.com/JkppT2jJfe
— KTR (@KTRTRS) February 17, 2019