తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ముందుగా జన్మధిన శుభాకాంక్షలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతుంది.ఈ ఐదేళ్ళ కాలంలో తెలంగాణ తనను తాను రుజువు చేసుకుంది.కేసీఆర్ లాంటి సమర్ధుడైన,ముందుచూపు కలిగిన నాయకుని పాలనలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణా వెలుగొందుతోంది.నేడు దేశానికి తెలంగాణా రోల్ మోడల్ గా నిలబడింది.తెలంగాణా పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకుంటుందంటే మన పరిపాలన ఎలా ఉందో అర్దం చేసుకోవొచ్చు..
అయితే ఇవేవి రాత్రికి రాత్రే జరిగిపోయినవి కావు.దీనివెనక సుదీర్గమైన ఆలోచన,తెగువ,పట్టుదల,కార్యదీక్షత ఉంది.మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు తెరాసా పార్టీ పెట్టిన నాడు ఎన్నో సందేహాలు,నిలుస్తాడా గెలుస్తాడా అనిహేళన చేసారు.ఇవేమి కేసీఆర్ గారు పట్టించుకోలేదు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెల్లారు.ఫలితం అప్పట్లో వచ్చిన ఎంపిటీసి,జెడ్పీటీసి ఎన్నికల్లో తెలంగాణా వాదంతో ముందుకెల్లిన తెరాసా అఖండ విజయం సాదించింది.తెలంగాణా బావజాల వ్యాప్తిని ప్రజల్లోకి తీసుకెల్లేందుకు కేసీఆర్ గారు అనేక సభలను,సమావేశాలను నిర్వహించారు.తెలంగాణాకు అన్యాయం జరిగిన ప్రతీసారి పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెల్లి ఉద్యమ వేడిని రాజేసారు.గెలుపువస్తే పొంగిపోకుండా,ఓటమి వస్తే కృంగిపోకుండా లక్షసాదనే ద్యేయంగా ఆయన నిలబడ్డాడు.
జీవితాలు ఉంటాయో,పోతాయో తెలియని స్థితిలో బలం కలిగిన లాభియింగ్ తో ఏదైనా చేయగలిగిన సమైక్య నాయకులతో బక్కపలుచనైన కేసీఆర్ ఎదురొడ్డి నిలిచారు.అతని సంకల్పం ముందు అవేమి ఎదురు నిలవలేకపోయాయి ప్రజామద్దతుతో రాదనుకున్న తెలంగాణాను తెచ్చి తెలంగాణా ప్రజలకి ఆరాద్యదైవంగా కేసీఆర్ గారు నిలిచారు.తెలంగాణా ఇస్తూ తెరాసా ను కాంగ్రేస్ లో విలీనం చేయమని షరతు పెట్టినప్పటికి తెలంగాణా ప్రజల అభిష్టం మేరకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఎవ్వరి మద్దతూ అవసరం లేకుండా తెలంగాణా రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.
తెలంగాణా వస్తే ఏం బాగు చేసుకోవాలో ఉద్యమ సమయంలో సుదీర్గంగా జయశంకర్ సార్,ఇతర మేదావి వర్గంతో మేథోమథనం చేసారు.తెలంగాణా కు ఏది అవసరంమో ప్రజల్లోకి వెల్లి అద్యయనం చేసారు.తెలంగాణా ఏర్పాటై కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొలువుదీరాక ఆ ఆలోచనలను ఉద్యమస్పూర్తితో ఆచరణలో పెట్టి విజయం సాదించారు.
తెలంగాణా వస్తే చీకట్లు అలుముకుంటాయని ఒకరన్నారు,తెలంగాణా కు పాలించడం చేతకాదని ఒకరన్నారు.కానీ కేవలం నాలుగున్నరేళ్ళలోనే దేశవ్యాప్తంగా తెలంగాణా పై చర్చ మొదలైంది.తెలంగాణా లో రైతు జీవితం బాగుపడేందుకు అడుగులు పడ్డాయి.దేశ చరిత్రలో రైతుశకం తెలంగాణా నుండే మొదలైంది.తెలంగాణా లో మొదలెట్టిన రైతులకు పెట్టుబడి సాయం,రైతుభీమా పథకాలు దేశం ఇప్పుడు ఆచరణలో పెడుతుంది.దేశంలోని పలురాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలను వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.దేశవ్యాప్తంగా తెలంగాణా ఇప్పుడు ఒక బ్రాండ్,ఒక రోల్ మోడల్ పాలించడం రాదన్నవాళ్ళకు పాఠాలు చెప్పే స్థితిలో తెలంగాణాకు కేసీఆర్ గారు నిలబెట్టారు.
కేసీఆర్ గారిది గొప్ప వ్యక్తిక్త్వం శత్రువు ఆపదలో ఉన్నా దగ్గరకు తీసే గొప్పమనసు ఆయన సొంతం.తెలంగాణా ప్రజల సమస్యలను జీవన స్థితిగతులను అతను దగ్గరనుండి చూసారు.అందుకే వారి బ్రతుకుల్లో మార్పు చూడాలని అనేక సంక్షేమ పథకాలను తెలంగాణాలో ప్రవేశపెట్టి వారి బ్రతుకుల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.దేశంలోనే సంక్షేమంలో తెలంగాణా ముందువరుసలో ఉంది.ప్రభుత్వఫలాలు ఎలాంటి పైరవీలేకుండా ప్రజలకు నేరుగా చేరాలనే కేసీఆర్ సంకల్పానికి ప్రజలు జై కొడుతున్నారు.నిర్ణయాలు తీసుకోవటంలో కేసీఆర్ గారిది ప్రత్యేకశైలి అతను తీసుకునే నిర్ణయాల్లో ఖచ్చితత్వం ఉండటుంది.విమర్శలను ఆయన పట్టించుకోడు అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతుందంటే అతను ఎంతవరకైనా వెల్తాడు అదీ ఆయన గొప్ప వ్యక్తిక్త్వం.తెలంగాణాను 60ఏండ్లుగా పాలించిన వారు నిర్లక్ష్యానికి గురిచేసారు.అసలు తెలంగాణాను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు.తెలంగాణాలో అన్నీ ఉన్నా అల్లుడునోట్లో శని ఉన్నట్టు సమైక్య పాలనలో మన వనరులు,మన సంపద,మన నీళ్ళు,నిదులు తరలించబడ్డాయి.కానీ వాటన్నీటికి సమాదానం చెబుతూ తెలంగాణాస్వరాష్ట్రంలో సగౌరవంగా పాలన అందించి కేసీఆర్ గారు మన నీళ్ళతో కాళేశ్వరంలాంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి ప్రతీ ఎకరాకు నీరందే బృహత్తర కార్యక్రమం చేపట్టారు.తెలంగాణా రైతాంగం మరో రెండేండ్లలో సిరులు పండించనున్నారు.ఇప్పటికే పూర్తైఙ ప్రాజెక్ట్ ల క్రింద వ్యవసాయం పండుగగా మారింది.త్వరలో మరిన్ని ప్రాజెక్ట్ లు పూర్తి అయి తెలంగాణా పచ్చలహారంగా మరవనుంది.పెట్టుబడి సాయంతో రైతుకు కొంత బలం చేకూరి రైతు వ్యవసాయం సంతోషంగా చేసే పరిస్థితి తెలంగాణాలో ఏర్పడింది.
ముందస్తు ఎన్నికలకు వెల్లిన ఏ ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రంలో తిరిగి గెలవలేదు.కానీ కేసీఆర్ ఆ చరిత్రను తిరగరాశారు.ప్రజామద్దతు ఉన్నప్పుడు చరిత్రలు తిరగరాయచ్చని ఆయన నిరూపించారు. సాహసోపేతంగా ప్రభుత్వాన్ని ముందస్తుగానే రద్దుచేసి గత డిసెంబర్ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాదించారు.కేసీఆర్ గారిని ఓడించేందుకు రెండు జాతీయపార్టీలు ,పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి,ప్రదానమంత్రి తో సహ అనేక మంది వచ్చి ప్రచారం చేసినప్పటికి తెలంగాణా ప్రజలకు కేసీఆర్ గారు అందించిన సంక్షేమం ముందు ఇవన్నీ పనిచేయలేదు.ప్రజలకు మేలు చేస్తే ప్రజలే తమను తిరిగి గెలిపిస్తారను తాను చేసిందే చెప్పాడు.చెయ్యనిది ఎందుకు చేయలేదో వివరించారు కేసీఆర్ గారి పట్ల ప్రజలకు ఉన్న నమ్మకమే ఆయన్ను తిరిగి అధికారంలోకి తెప్పించింది.
ఇప్పుడు ఈ దేశానికి కేసీఆర్ గారి అవసరం ఉంది.ఆయన పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.ఇలాంటి పాలన దేశంలో అందించగలిగితే దేశ రైతాంగం,పేదరిక నిర్మూళన,సాగునీరు అన్నీ సాద్యమవుతాయి.దేశ ప్రజలు సైతం ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు.ఆ ప్రత్యామ్న్యాయం కేసీఆర్ గారి రూపంలో దొరకునుందనడంలో సందేహం లేదు.రానున్న ఎన్నికల్లో కేసీఆర్ గారి పాత్ర దేశంలో కీలకం కానుంది.దేశానికి తొవ్వచూపిన తెలంగాణా రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో దేశాన్ని నడిపిస్తుందనటంలో సందేహం అక్కర లేదు.విలక్షణమైన ,కార్యదీక్షుడైన కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం..తప్పకుండా దేశ ప్రజలు ఆయన్ని దేశ సేవకు కీలక బాద్యతలో ఉంచుతారు.అతను ఈ దేశానికి తొవ్వ చూపుతారు.
హ్యాపీ బర్త్ డే కేసీఆర్ గారు..