ఏపీలో అన్ని పార్టీల నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఇప్పటికే, అధికారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గత వారం నుండి వైసీపీలోకి చేరుతూనే ఉన్నారు. తాజాగా బీజేపీకి భారీ షాక్ తగలబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న సీనియర్ పార్లమెంటిరియన్, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయన రెండు మూడు రోజుల్లో జగన్ని కలసి తన అబిప్రాయాన్ని చేప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కావూరి వంటి సీనియర్ రాక వల్ల వైసీపీకి పశ్చిమ గోదావరి జిల్లాలో మరింతగా బలం పెరగుతుంది. కావూరితో పాటు ఆయన అనుచర గణం కూడా పార్టీలోకి వస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే పార్టీ మారడంపై కావూరి ఖండించకపోవడం ఇక్కడ విశేషం.