సినీ నటుడుకు వైసీపీలో పదవి ఇచ్చిన జగన్
టాలీవుడ్ సినీ నటుడు పృథ్వీరాజ్ కు వైసీపీ పార్టీలో పదవి ఇచ్చారు. ఆయనను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీ గత కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే..వైఎస్ జగన్ ఇటీవల నిర్వహించిన ప్రజాసంకల్పయాత్రలో కూడా ఆయన పాల్గొన్నారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఫల్యాలను, ప్రజల సమస్యలను తరచూ ఎత్తిచూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యప్రజలకు తెలిసేలా త్వరలో వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
