వైఎస్ జగన్పై ప్రసంసల జల్లు కురిపించారు టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జై రమేష్.రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజలకు మంచి పాలన అందిస్తారని అయన చెప్పారు.నిన్న లోటస్ పాండ్ లో జగన్ను కలిసిన రమేష్ మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ వీస్తుందని ఆయనే సీఎం అవుతారని..చంద్రబాబు మోసం చేసినట్టు కాకుండా ఇచ్చిన హామీలను కచ్చితంగా నేరవేరుస్తారని చెప్పారు.ఆయన మాట ఇస్తే దానిపైనే ఉంటాడని అన్నారు.చంద్రబాబు పై విమర్శల జల్లు కురిపించారు.ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుందని..ఇంతటి అవినీతి నా జీవితంలో ఎన్నడూ చూడనేలేదన్నారు.
ఇక్కడ ప్రతీ పనికి కమీషన్లు తీసుకుంటున్నారని,ప్రతీ టీడీపీ నేత సుమారు 200 కోట్లకు పైగానే దోచుకున్నారని చెప్పుకొచ్చారు.ఇలా దోచేసుకుంటే పోతే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.2001 నుండి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నానని,1999లో గన్నవరం అసెంబ్లీ,విజయవాడ పార్లమెంట్ ఇస్తానని ఆశపెట్టి మోసం చేయడంతో అప్పటి నుండి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నానని చెప్పారు.30సంవత్సరాలు ఆ పార్టీకి సేవ చేసి ఒక్క పైసా కూడా సంపాదించుకోలేదన్నారు.చంద్రబాబు గెలవడానికి నేనే సాయం చేశానని,కాని ఆ పార్టీ నుండి ఎప్పుడూ ఏది ఆశించలేదన్నారు.త్వరలోనే వైసీపీలో చేరుతానని స్పష్టం చేశారు.