త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు వన్డేలకు,రెండు టీ20లకు బీసీసీఐ శుక్రవారం నాడు జట్లను ప్రకటించింది.రానున్న వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకొని జట్టును ప్రకటించారని తెలుస్తుంది.విరాట్, బూమ్రా తిరిగి జట్టులోకి వచ్చేసారు.ఈసారి ప్రత్యేకంగా తొలి రెండు వన్డేలకు,మిగిలిన మూడు వన్డేలకు మరియు టీ20లకు జట్లను ప్రకటించారు.అయితే సీనియర్ బ్యాట్స్‌మెన్ అనుభవజ్ఞుడైన దినేశ్ కార్తీక్‌ను మనేజ్ మెంట్ పక్కన పెట్టి రిషబ్ పంత్‌కు అవకాసం ఇచ్చారు.కేవలం టీ20లకు మాత్రమే అవకశం కల్పించారు. దీంతో దినేష్ కార్తిక్ కెరీర్ ఇక ముగిసినట్లేనని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఇక మొన్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలలో చిక్కుకున్న కేఎల్ రాహుల్ రిజర్వ్ ఓపెనర్‌గా అవకాశం దక్కింది.
తొలి రెండు వన్డేలకు జట్టు:
కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, ధోనీ, రాయుడు, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, బుమ్రా, షమీ, చాహల్, కుల్దీప్, విజయ్ శంకర్, సిద్ధార్థ్ కౌల్, కేఎల్ రాహుల్.
చివరి మూడు వన్డేలకు జట్టు:
కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, ధోనీ, రాయుడు, కేదార్ జాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, భువనేశ్వర్, చాహల్, కుల్దీప్ షమీ, విజయ్ శంకర్, కేఎల్ రాహుల్.
టీ20లకు జట్టు
కోహ్లీ (కెప్టెన్), రోహిత్, కేఎల్ రాహుల్, ధవన్, ధోనీ, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్, చాహల్, బుమ్రా, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్, మయాంక్ మార్కండే.