మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారనే వార్త హాట్ టాపిక్ అవుతోంది.. గంటా టీడీపీని వీడి వైసీపీలోకి వెళతారట.. గతంలో ఇదే విషయాన్ని వైసీపీ నేత వద్ద ప్రస్తావిస్తే.. పార్టీ విధివిధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని, పార్టీలోకి రావాలనుకునే వాళ్లు తమ పదవులకు రాజీనామా చేసి రావాలన్నారు. మరోవైపు గంటా కూడా టీడీపీకి దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌కు గంటా డుమ్మా కొట్టడంతో ప్రతీ సమావేశానికి హాజరయ్యే గంటా పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న సమయంలో గైర్హాజవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
వాస్తవానికి జగన్ పాదయాత్రన విశాఖకు చేరుకున్న సమయంలోనే గంటా వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటూ పలు వార్తలు వినిపించాయి. అలాగే తాజాగా అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ లో చేరుతూ 2014 లో నేను,గంటా జగన్ ను కలిసి వైసీపీలో చేరుతాం మాకు 5టికెట్లు కావాలని అడిగాము కానీ జగన్ మూడే ఇస్తామన్నారు.. అప్పుడు మేము చంద్రబాబు దగరికి వెళ్లి అడిగితే 5టికెట్లు ఇస్తా అని చెప్పి మూడే ఇచ్చారని అవంతి నిజం బయటపెట్టారు. అలాగే అవంతితో పాటు చీరాల ఎమ్మెల్యే ఆమంచి, దర్శి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్, మాగుంట శ్రీనివాస్ వంటి నాయకులతో పాటు తోట త్రిమూర్తులు కూడా వైసీపీలో చేరుతున్నారట.. ఇప్పటికే ఎంతో కష్టపడుతున్న వైసీపీ అధినేత వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశాలపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
సమరశంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తూనే పార్టీ విజయ శంఖారావం మోగించేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ బూత్‌లెవల్ కన్వీనర్లు, సభ్యులతో సమావేశమయ్యారు. క్రమంలో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కీలక నిర్ణయాలు తీసుకుంటారట.. ఈ క్రమంలో భీమిలీ ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీకి ఆకర్షితులయినట్టు తెలుస్తోంది. సామాజికపరంగా, ఆర్థికంగా బలంగా ఉన్న గంటా వైసీపీలో చేరితే వైసీపీ గెలిచి గంటా మరోసారి మంత్రి అవ్వడంతోపాటు విశాఖ ప్రాంతంలో కూడా వైసీపీకి మరింత పట్టు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.