శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ఓ రెవెన్యూ ఉన్నతాధికారి తాను చెప్పిందే వేదం అన్నటుగా వ్యవరిస్తున్నారు.ఇదేంటని ఎవరైనా అడిగితే తన అధికారాని ఉపయోగించి భూములు ఆక్రమించారని నోటీసులు పంపించి..తప్పుడు కొలతలు వేసి పట్టాలు రద్దు చేస్తామంటూ బెదిరిస్తాడు.అసలు విషయానికి వస్తే పదవిలో ఉన్న ఏ అధికారి ఐన సరే అధికార మరియు ప్రతిపక్ష నేతలకు కచ్చితంగా గౌరవిస్తారు. ఈ అధికారి మాత్రం అధికారపార్టీ నేతలకే ప్రాధాన్యం ఇస్తారు.
అంతే కాకుండా ఆ మండలంలో అన్ని గ్రామాలలోను అధికారపార్టీ నాయకులను ఒక గ్రూప్ గా తయారు చేసి వాళ్ళ పనులు మాత్రమే సక్రమంగా చేస్తారు.ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేసి మరి సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వానికి చెందినవి అని బెదిరిస్తున్నాడు.ఈ అధికారి వేధింపులు తట్టుకోలేకా బుక్కాపురం గ్రామానికి చెందిన ఓ రైతు హత్మహత్యకు పాల్పడి చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు.దీంతో పలువురు బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.