ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. టీడీపీకి చెందిన మరో కీలకనేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ నేత దాసరి జై రమేశ్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనను విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15న లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌తో జై రమేష్ భేటీ అయ్యే అవకాశం ఉంది. జై రమేష్ కొంతకాలంగా టీడీపీ దూరంగా ఉంటూ వస్తున్నారు. విజయ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ అయిన జై రమేష్ ఎన్టీరామారావు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రమేష్ కీలకంగా వ్యవహరించారు. టీడీపీ కీలకనేత, టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరున్న దాసరి జై రమేశ్ వైసీపీలో చేరుతుండడం సామాజికంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం కలగనుంది.