ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంతో వస్తున్న చిత్రాలు సంచలనం సృష్టిస్తున్నాయి.ఇప్పుడే కాదు ముందు ముందు మరింత సంచలనం చేయబోతున్నాయి.ఈ చిత్రాలతో రాజకీయ భవిష్యత్తు ఎవరికీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.కొద్దిరోజుల క్రితమే విడుదలైన ‘యాత్ర’ సినిమా సూపర్ హిట్ అయింది.ఇందులో వైఎస్ఆర్ పాదయాత్ర హైలెట్ గా నిలిచింది.ఈ సినిమాతో మరోసారి ఆయన పెట్టిన పథకాలను ప్రజలు గుర్తుచేసుకున్నారు.ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా జగన్ కు ప్లస్ అనే చెప్పాలి.
మరోవైపు ఎప్పుడూ వివాదాలలో ఉండే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నిన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రూపంలో బాంబ్ పేల్చాడు.ఇందులో ఎన్టీఅర్ చనిపోయే ముందు తను అనుభవించిన భాదాకరమైన విషయాల గురించి ఇందులో క్లియర్ గా చూపించినట్టు తెలుస్తుంది.ట్రైలర్ లోనే ఎన్టీఅర్ కుటుంబ సభ్యులను ఒక ఆట ఆడుకున్న వర్మ ఇంక సినిమా రిలీజ్ అయితే ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో ఆలోచనకే చిక్కడంలేదు.
ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ గమనిస్తే ఏపీ సీఎం చంద్రబాబుకు గట్టిగా వేసుకున్నాడని అర్ధమవుతుంది.ఇందులో ఎన్టీఅర్ చెప్పిన ఒక డైలాగ్..నా మొత్తం జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు వాడిని నమ్మడం అంటూ భావోద్వేగంతో చెప్పే డైలాగ్ ప్రస్తుత రాజకీయాలలో చాలా ఎఫెక్ట్ పడేలా ఉంది.ఇదే కాకుండా మరో డైలాగ్
చంద్రబాబు వాయిస్‌లో వస్తుంది.ఇది అప్పటి రాజకీయాలనే మార్చేసింది.ఎంత మార్చింది అంటే రాజుని బటుడిగా..బటుడిని రాజుగా మార్చేసింది.ఇప్పటికే ఆ డైలాగ్ అందరికి అర్ధమయ్యే ఉంటాది..ఇలాంటి డైలాగ్ వల్ల రానున్న రోజుల్లో రాజకీయాల్లో కల్లోలం సృష్టించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.