మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డిల రాజీనామాల వెనుక పెద్ద తతంగమే నడుస్తోంది.. వీరి బాటలోనే మరికొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కేవలం MLAలుగా పోటీచేయటం కోసమేనట.. రాజకీయంగా టీడీపీకి ఎదురుగాలి వీస్తుందని చెప్పటానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు పోటీచేసి గెలిస్తే రేపు అసెంబ్లీలో మెజారిటీ రాకపోతే, గెలిచినా ఆ ఎమ్మెల్సీ లు రాజీనామా చేసినప్పుడు అధికారంలో ఉన్న పార్టీకే ఆ ఎమ్మెల్సీ సీట్లు వెళ్లిపోతాయి..
అందుకే ముందు జాగ్రత్తగా ఖాళీ ఐన సీట్లు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి దక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ఎలెక్షన్ల కంటే ముందే ఎమ్మెల్సీ బై ఎలెక్షన్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడున్న బలం ప్రకారం రాజీనామా చేసిన సీట్లన్నీ టీడీపీ గెలుస్తుందని దీంతో టీడీనీ అధికారంలో లేకపోయినా తమ పార్టీ సభ్యులు మండలిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు సంబంధించి ఇప్పుడే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎంతైనా చంద్రబాబు ముందస్తు తెలివితేటలు అంటారు ఇందుకే మరి.