ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు ప్రకటించిన ‘పసుపు–కుంకుమ’..అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పుకోవాలి.ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లడంలేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేసారు.చెక్కులు బ్యాంకు కు తీసుకెళ్తే డబ్బులివ్వడం లేదంట.చెక్కులు తీసుకొని పాత బకాయి జమ చేసుకుంటున్నాం అని చెబుతున్నారు.అయితే ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసాడు చంద్రబాబు.దీంతో రుణమాఫీ అవుతుందని ఆశతో వడ్డీ కట్టకపోవడంతో ఇప్పుడు వాళ్ళ పై మరింత భారం పెరిగింది.ఈ మేరకు ఇచ్చిన చెక్కులను బ్యాంకు వారు వడ్డీ రూపంలో జమ చేసుకుంటున్నారు.ప్రభుత్వం పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొన్న కుయ్యేరు నిన్న ఉరవకొండ ఇలా ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొనింది.ఉరవకొండ నియోజకవర్గంలోని మండలాలైన వజ్రకరూరు, విడపనకల్లులో సర్కార్ ఇచ్చిన చెక్కులను అక్కడ మహిలలో తమ తమ బ్యాంకులకు తీసుకెళ్లగా బ్యాంకు సిబ్బంది అందరికి షాక్ ఇచ్చారు.డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతో ఈ సొమ్ము జమ చేసుకుంటున్నామని చెప్పారు.ఈ నియోజకవర్గంలో సుమారు 300 మహిళా సంఘాలు సంభందించిన చెక్కులు జమ చేసినట్లు తెలిసింది.చంద్రబాబు దొంగ హామీల వళ్ళ మహిళలు బలవుతున్నారు.చంద్రబాబును నమ్మిన మహిళలు బ్యాంకుకు డబ్బులు కట్టక..వాటికీ వడ్డీ పెరిగింది.వాటి వసూలు కొరకు ఉరవకొండ పట్టణంలోని మహిళా సంఘాలకు బ్యాంకు కోర్టు నోటీసులు పంపారు.