తాజాగా వచ్చిన రెండు బయోపిక్ సినిమాలు వైసీపీ పాలిట వరంగా మారనున్నాయి. ఒకటి రాజశేఖరరెడ్డి పోరాట పటిమ ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న జగన్ ఓటు వేయాలనిపించే సినిమా రెండోది సీఎం చంద్రబాబు సొంత మామను వెన్నుపోటు పొడిచి కుట్ర రాజకీయాలు చేసిన చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయకూడదో తెలియచెప్పే సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇటీవల మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర మూవీ ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకువచ్చింది.
ఈ సినిమా మంచి వసూళ్లను సాధించడమే కాకుండా తెలుగుప్రజలందరికీ ఈ సినిమా ఎంతగానో నచ్చింది. అలాగే వాలెంటైన్స్ డే సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసాడు వర్మ. నిజమైన ప్రేమకు ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి ఐకాన్స్ అంటూ ఎన్టీఆర్ జీవితకథను రాయడానికి వచ్చిన లక్ష్మీ పార్వతి ఎలా ఎన్టీఆర్ జీవిత భాగస్వామి అయిందో కుటుంబ సభ్యులకు ఇష్టం లేకున్నా ఎదురించి పెళ్లి చేసుకోవడం దగ్గరినుండి చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఎలా ముఖ్యమంత్రిగా గద్దె దించారనేది ఈ ట్రైలర్‌లో ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా వైస్రాయ్ హోటల్‌లో ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ పై చెప్పులు విసరడం చూపించారు.
ఆ ఘటనతో ఎన్టీఆర్ ఎలా కుమిలి పోయారనేది చూపించారు. ట్రైలర్ చివర్లో నేను జీవితంలో చేసిన మొదటి తప్పు చంద్రబాబును నమ్మడం అంటూ ఎన్టీఆర్ చెప్పడం.. అలాగే ఎన్టీఆర్ అసలుకథ ఇదే అంటూ ముగించారు. వర్మ ఈ సినిమాను చాలా డేర్ గా వన్ సైడ్‌గానే తెరకెక్కించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రెండు సినిమాల ప్రభావం భారీగా కనిపించే అవకాశం స్పష్టంగా తెలుస్తోంది.