ఏపీలో రాజాకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి పక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. సీటు దక్కదనో.. ఇంకా మంచి పదవి దక్కుతుందనో నేతలు పార్టీలు మారుతున్నారు. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ అధినేత జగన్‌ను కలిసి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 24గంటలు కూడా గడవక ముందే విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ గురువారం ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భేటీ అయ్యారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్ జగన్ నివాసంలో వీరి భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం జగన్ సమక్షంలో వైసీపీలో అవంతి శ్రీనివాస్ చేరారు.ఈ భేటీలో పార్టీ నేతలు విజయసాయిరెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు. వైసీపీలో చేరిన అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ను బుజ్జగించేందుకు టీడీపీ ప్రయత్నించింది. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్న అవంతి శ్రీనివాస్… భీమిలీ లేదా విశాఖ నార్త్ టికెట్ తనకు కేటాయించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం. అయితే టీడీపీ నేతలు వైఎస్ జగన్‌తో భేటీ కావడం చంద్రబాబుకి గట్టి ఎదురుదెబ్బగా మారింది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైఎస్ జగన్‌తో భేటీ అయ్యి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించడం. టీడీపీ శ్రేణులకు గట్టి షాక్‌నిచ్చింది.