వార్ వన్ సైడ్ గా తీసిన వర్మ.. చంద్రబాబును నమ్మడమే తానే జీవితంలో చేసిన మొదటి తప్పన్న ఎన్టీఆర్… ప్రేమికులరోజు
sivakumar
February 14, 2019
18+, MOVIES, POLITICS, SLIDER
1,111 Views
నందమూరి బాలకృష్ణ వాళ్ల నాన్న ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసాడో అప్పుడే రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను అనౌన్స్ చేసి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు.. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసాడు వర్మ.. ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసాడు వర్మ. నిజమైన ప్రేమకు ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి ఐకాన్స్ అంటూ ఎన్టీఆర్ జీవితకథను రాయడానికి వచ్చిన లక్ష్మీ పార్వతి ఎలా ఎన్టీఆర్ జీవిత భాగస్వామి అయిందో కుటుంబ సభ్యులకు ఇష్టం లేకున్నా ఎదురించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఎలా ముఖ్యమంత్రిగా గద్దె దించారనేది ఈ ట్రైలర్‌లో ఉంది.
అన్నిటికన్నా ముఖ్యంగా వైస్రాయ్ హోటల్‌లో ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ పై చెప్పులు విసరడం చూపించారు. ఆ ఘటనతో ఎన్టీఆర్ ఎలా కుమిలి పోయారనేది చూపించారు. ట్రైలర్ చివర్లో నేను జీవితంలో చేసిన మొదటి తప్పు చంద్రబాబును నమ్మడం అంటూ ముగించారు. ఇదే ఎన్టీఆర్ అసలు కథ అంటూ ముగించాడు. మొత్తానికి వర్మ ఈ సినిమాను వన్ సైడ్‌గానే తెరకెక్కించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది ఈ సినిమాతో దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ తన మ్యాజిక్‌ను రిపీట్ చేస్తాడనిపిస్తోంది. 1989లో ఎన్టీఆర్ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన తర్వాత నుంచి ఈ స్టోరీని తీసుకుని ఎన్టీఆర్ మరణించేవరకూ ఈ సినిమా ఉంటుందని అర్ధమవుతోంది.
Post Views: 323