సత్తెనపల్లి లో న్యాయవాది గుమస్తాలుగా విధులు నిర్వహిస్తున్న వారు సుమారు 50 మంది ఈ రోజు రోడ్ ఎక్కి, నిరాహారదీక్ష చేపట్టి తమ బాధలను చెప్పుకుంటున్నారు.ప్రభుత్వం మాకు ఇచ్చే పైకముతో మేము చాలీ, చాలని ఆదాయం తో కుటుంబాన్ని పోషించాలంటే చాలా కష్టం గా ఉంది, మాకు జీత భత్యాలు పెంచమని ,అదే విధంగా సదరు యాక్ట్ 13/1992 ప్రకారం డెత్ బెనిఫిట్ కింద 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పెంచాలని సదరు శాసన సభ్యుడిని మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసనకు దిగారు.
2014 లో కూడా మాకు ఎన్నో హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేశారు అని వాపోయారు.వైస్సార్ కాంగ్రెస్ సత్తెనపల్లి సమన్వయకర్త శ్రీ అంబటి రాంబాబు గారు వారి దీక్షా శిబిరాన్ని సందర్శించి, వారి హామీలను తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా హమలు అయ్యేలా చూసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.