ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలోఉన్న తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు త్వరలో ప్రతి పక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతతో రేపో,మాపో భేటీ కానున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పలువురు నేతలు వివిధ కారణాలతో పార్టీలు మారుతున్న విషయం తెలిసిందే. ఇటీవల్లనే కడప జిల్లా రాజంపేట నియోజవర్గం టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరారు. తాజాగా ఒకేరోజు ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ , అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి ఇద్దరు టీడీపీ రాజీనామా చేశారు. ఒకరు త్వరలో వైసీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరోకరు రేపో మాపో వైసీపీలో చేరికపై ప్రకటించే అవకాశం ఉనట్లు సమచారం. అంతేకాదు ఏపీ రాష్ట్ర వాప్యంగా అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే 36 మంది వైసీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. దానికి కారణాలు కూడ క్రింద కామెంట్లల్లో వారు పెట్టడం చర్చనీయాశం అయ్యింది. అది ఏమీటంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్ భారీ విజాయాన్ని అందుకోబోతున్నాడని తెలిసి వైసీపీలో చేరుతున్నారని చేబుతున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది వైసీపీలో చేరుతున్న ఆ 36 మంది టీడీపీ ఎమ్మెల్యేలే ఎవరు అని…?
