క్రిష్,నందమూరి బాలకృష్ణ కలయికలో వచ్చిన చిత్రం కధానాయకుడు.ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి రాంగోపాల్ వర్మ పైనే ఉంది.ఈ వివాదస్పద డైరెక్టర్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అయితే సినిమా హిట్ లేదా ప్లాప్ అనేది పక్కన పెడితే రిలీజ్ కు ముందు అంచనాలు పెంచడంలో వర్మను మించిన వాళ్ళు లేరనే చెప్పాలి.ఎందుకంటే ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు మరియు ట్వీట్లు చేస్తూ తన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు రామ్ గోపాల్ వర్మ ఫుల్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు.ప్రస్తుతం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక బాంబు పేల్చాడు వర్మ.రేపు ఫిబ్రవరి 14న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నానని తనదైన శైలిలోనే వర్మ ప్రకటించారు.
అయితే ఈ ట్రైలర్ ను ఉదయం 9:27 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు.కాగా దీనికి సంభందించిన పిక్ పోస్ట్ చేసి..”ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. 9:27AM కల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు”అని చెప్పుకొచ్చారు.