ఈ మధ్యకాలంలో చంద్రబాబు తరచుగా విమర్శించే వారిలో మోదీ ముందు వరుసలో ఉన్నారు.వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారంటూ ప్రధానమంత్రి పై విమర్శల జల్లు కురిపిస్తున్నారు.ఒకరిని అనే ముందు మనం ఏంటో కూడా చూసుకోవాలి..అధికారం ఉందికదా అని ఏదైనా చేయొచ్చు అనుకుంటుంది టీడీపీ ప్రభుత్వం.ఈ సారి మాత్రం టీడీపీకి దెబ్బ పడింది.రానున్న ఎన్నికలకు తమకు సపోర్ట్ గా ఉండాలంటూ అక్కడ పోలీసులకు లంచాలు ఇస్తున్నారంటూ మైలవరంలో వైసీపీ నేతలపై కేసులు పెట్టబోయిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు కధ అడ్డం తిరిగింది.టీడీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది.జిల్లా ఎస్పీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి బరిలోకి దిగడంతో దీనికి ముగింపు ఇచ్చారు.వైసీపీ నేతలు పోలీసులకు లంచాలు ఇచ్చారన్నఆరోపణ తప్పు అని ఉన్నతాధికారులు నిరూపించారు.
అంతేకాక పోలీస్ అధికారులు ఎస్ఐ అస్పక్ మరియు శ్రీనివాసులు అక్కడ టీడీపీతో కలిసి కావాలనే కేసులు పెట్టబోయారని పోలీసుల విచారణలో తేలింది.దీంతో ఈ ఇద్దరిపై ఉన్నతాధికారులు కఠినచర్యలు తీసుకున్నారు.ఇటీవల వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎన్నికల్లో పోలీసుల పాత్ర కోసం ఫిర్యాదు చేశారు.సొంత వర్గానికి చెందిన వారికే బాబు ప్రమోషన్లు ఇచ్చి రానున్న ఎన్నికల్లో వారిని తమకు సరిపడేలా ఉపయోగించుకోనున్నారని ఫిర్యాదు చేశారు.అది జరిగిన కొద్దిసేపటికే మైలవరంలో ఈ సంఘటన జరిగింది.దీనిబట్టే అర్దమైంది అక్కడ మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడుస్తుందని.