ఏపీ అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. గత కొంతకాలంగా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ నుండి గెలిచిన అవంతి శ్రీనివాస్.. టీడీపీని వీడి వైసీపీలోకి వెళుతున్నారని కొద్ది రోజులుగా ఒక వార్త జోరుగా ప్రచారం అవుతోంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో నియోజక వర్గాలుగా టీడీపీ నేతల పని తీరు పై సర్వే నిర్వహించిన చంద్రబాబుకు అవంతి శ్రీనివాస్ పై బ్యాడ్ రిపోర్ట్ వచ్చిందట. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టీడీపీ నుండి టిక్కెట్ కష్టమని చంద్రబాబు తేల్చేశారట.ఈ నేపధ్యంలో ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పేసి, వైసీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారని.. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే వైసీపీ ముఖ్యనేతలతో చర్చించారని, జగన్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని, భీమిలీ నుండి టిక్కెట్ కూడా కన్ఫామ్ అయ్యిందని, త్వరలోనే ఆయన వైసీపీలోకి చేరడం ఖాయమని జోరుగా వార్తలు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టిస్తోంది.
