పెండింగ్ లో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ సమస్యకు పరిష్కారం చూపాలని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇవాళ లోక్ సభలో ఎంపీ జితేందర్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించబోయే సచివాలయానికి బైసన్ పోలో స్థలాన్ని కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో సీఎం కేసీఆర్ ఈ విషయంపై చర్చించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ విషయంపై పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ప్రధాని మోదీ ఈ అంశంపై రక్షణశాఖతో మాట్లాడి సత్వర పరిష్కారం చూపాలని కోరారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను శాంతియుతంగా పోరాడి సాధించుకున్నామని తెలిపారు. పరిష్కారంకాని సమస్యలపై ఆర్డినెన్స్ తీసుకువచ్చిన ప్రభుత్వం…బైసన్ పోలో స్థలం కేటాయింపు నిర్ణయంపై ప్రభుత్వం జాప్యంచేస్తుందన్నారు.