ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నాలుగున్నర ఏళ్ళు చేయలేనిది ఓట్ల కోసం ఇప్పుడు ప్రజలను మబ్బి పెట్టడానికి కొన్ని పథకాలు ముందుకు తెచ్చింది.ఇందులోదే పసుపు కుంకుమ పథకం.దీని ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు చొప్పున ఇస్తామని చెప్పుకొచ్చారు.గత ఎన్నికల్లో రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం ఎలాగూ అవ్వలేదు కనీసం ఈ పథకమైన సక్రమంగా అమలు కావాలని కోరుకుంటున్నారు. చెక్కులు అయితే ఇవ్వడం జరిగింది కాని బ్యాంకులకు వెళ్తే మాత్రం డబ్బులు రావడం లేదు.కొన్ని చెక్కులు అయితే ఏకంగా పనిచేయవని చెబుతున్నారు.
నిన్న కుయ్యేరు స్టేట్‌బ్యాంక్ దగ్గర కొందరు మహిళలు మాట్లాడుతూ..577 డ్వాక్రా గ్రూపులకు చెక్కులు పంపిణీ చేసారని..అయితే ఆ సొమ్ము కోసం బ్యాంకు కి వెళ్తే ప్రస్తుతం రూ.2,500, ఎన్నికల తరువాత మిగిలన డబ్బు ఇస్తామని చెప్పారట.అంతే కాకుండా చెక్కులు తీసుకొని వెళ్తే రేపు రండి ఎల్లుండు రండి అంటూ రోజులు గడిపేస్తున్నారు తప్ప సొమ్ము ఇవ్వడంలేదని ఆ గ్రామానికి చెందిన సాయిరామ్, లలితాదేవి, రామాంజనేయ, అనిత, శ్రీ సత్తెమ్మ, మల్లీశ్వరి, కోదండరామ, మదర్ థెరీసా మహిళా శక్తి సంఘాలకు చెందిన డ్వాక్రా మహిళలు ఆందోళనలు వ్యక్తం చేసారు.