ధర్మపోరాట దీక్షతో ఢిల్లీలో హడావిడి చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరుస ట్వీట్లతో చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్‌ను ఏకిపారేశారు. నల్లచొక్కాలతో నిరసన తెలుపుతున్న చంద్రబాబును ఆ చొక్కాలను భద్రంగా దాచుకోవాలని సలహా ఇచ్చారు. ‘నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి గదా. బ్లాక్ షర్టులో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు!’ అంటూ ఎద్దేవా చేశారు.
తండ్రేమో గాంధీ మహాత్ముడి అంతటి వాడినని డబ్బా కొట్టుకుంటాడు. కొడుకేమో ప్రపంచ బ్యాంక్ లో “అతి పేద్ద” ఉద్యోగం వదులుకొని ప్రజా “షేవ్" కోసం వచ్చానని అంటాడు. నాలుగున్నరేళ్లు చెద పురుగుల్లా రాష్ట్రాన్ని తిని ఇప్పుడు కొత్త అవతారాలు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 12, 2019
చంద్రబాబు ఢిల్లీ దొంగ దీక్షను ఎవరూ పట్టించుకోకున్నా కుల మీడియా మాత్రం తెగ హైరానా పడింది.బులెటిన్ల నిండా దీక్ష విజువల్సే.మళ్లీ అరగంట స్పెషల్ ప్రోగ్రాంలు నడిపి తమ జాతి పిత రుణం తీర్చుకున్నాయి. ప్రైమ్ టైంలో నల్ల చొక్కాల పబ్లిసిటీ గోల చూడలేక చానళ్లు మార్చుకున్నారు తెలుగు ప్రేక్షకులు!
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 12, 2019
అవినీతికి ఒక రూపం ఉంటే అది "యూ టర్న్ నిప్పు నాయుడు". కుల పిచ్చి, బంధుప్రీతి, నయవంచన, నీతిమాలిన పనులు చేయడంలో ప్రపంచ రికార్డులన్నీ సొంతం చేసుకున్నవ్యక్తి చంద్రబాబు. మహాత్మా గాంధీ లాంటి వాడినని చెప్పుకుంటే సరిపోదు. ఆయన విగ్రహాల నీడను కూడా తాకే అర్హత లేని వ్యక్తి తమరు!
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 12, 2019
నాలుగేండ్లు కలిసి తిరిగిన వారిపైన పోరాటం పేరుతో చంద్రబాబు చేసే ఆఖరు నిమిషం దీక్షల వల్ల ఆయనకూ, రాష్ట్రానికి ఏ ప్రయోజనం సిద్ధించవు. పరీక్షలకు గంట ముందు పిల్లలు సిలబస్ చదవటం లాంటిదే ఇది. ఆరాటం కొద్దీ చదువుతారు కాని ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తు రావు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 12, 2019
నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి గదా. బ్లాక్ షర్టులో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు!
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 12, 2019