ఏపీలో రాజకీయ వేడి మొదలైంది.ఎక్కడికక్కడ పార్టీలలో చేర్పులు,మార్పులు జరుగతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్‌సీలోకి వివిధ పార్టీలనేతలు, కార్యకర్తలు భారీసంఖ్యలో చేరుతున్నారు.జగన్ సిద్ధాంతాలు,పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారు.తాజాగా కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్గంలోని ప్యాపీలీ మండలం కలచట్ల గ్రామంలో భారీగా వైసీపీలో చేరారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా గత నాలుగేళ్లుగా ప్రజలందరికని మోసం చేసిన టీడీపీపై తీవ్ర వ్యతీరేకతో , టీడీపీకి మళ్లీ ఓటు వేస్తే మా బ్రతుకులు ఇంతే అని తెలుసుకోని భారీగా వైసీపీలో చేరారు. అంతేకాదు గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటి చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ ప్రతాప్ కు నియోజకవర్గంలో ఎక్కువగా ఓట్లు పడ్డ గ్రామం కలచట్లే. అలాంటిది ఇప్పుడు టీడీపీ పాలన వల్ల వారు చేస్తున్నదోపిడి వల్ల సామన్య ప్రజలతో పాటు సీనియర్ నాయకులు కూడా ప్రతిపక్ష వైసీపీలో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 50 వేలనుండి 70 వేల మెజార్టీతో మళ్లీ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గెలుస్తాడని తెలుస్తుంది. మరి ముఖ్యంగా బుగ్గనకు పోటిగా టీడీపీ టిక్కెట్ ఎవరికి ఇవ్వాలో అయోమయంలో పడిందంటా.. ఏది ఏమైనా జగన్ మాట బుగ్గన నిలబెడుతున్నాడు. మరోసారి డోన్ నియోజక వర్గంలో బుగ్గన వైసీపీ జెండా ఎగరవేయబోతున్నాడు అర్థమవుతుంది.