2014 ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ జిల్లాలో ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది.ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను అక్కడ ప్రజలు బహిష్కరించారు.ఇక్కడ నుండి వెళ్ళకపోతే పరిస్థుతులు వేరేలా ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు.అయితే ఎమ్మెల్యే పోలీస్ బలగం సహాయంతో ముందుకు వెళ్ళాలనుకున్న గ్రామస్తులందరూ ఒక్కటవ్వడంతో పోలీసులు కూడా చేతులెత్తేసారు.ఇక గత్యంత్రం లేక ఎమ్మెల్యే రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు.మీ సమస్యలను నాకు చెప్పండి నేను పరిస్కరిస్తానంటూ ప్రజలను మబ్బి పెట్టడానికి ప్రయత్నించాడు.కాని ప్రజలు ఏ మాత్రం లొంగకుండా ఐదేళ్ళుగా మీరు చెప్పిన అబద్ధాలు చాలు ఇక నమ్మే పరిస్థితే లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఈ ఒక్క జిల్లాలోనే కాదు మొన్నటికి మొన్న మంత్రి పరిటాల సునీతకు కూడా చేదు అనుభవం ఎదురైంది.పసుపు కుంకుమ కార్యక్రమంలో సునీత కాన్వాయ్ పై డ్వాక్రా మహిళలు చెప్పులు విసిరిన సంగతి అందరికి తెలిసిందే.కొవ్వూరు నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసారు.ఇప్పుడు టీడీపీకి క్లీన్ స్వీప్ ఇచ్చిన గోదావరి జిల్లాలో ప్రజలు ఈ మేరకు విరుచుకుపడడంతో సర్వత్ర సంచలనం రేపుతుంది.చంద్రబాబు ఢిల్లీలో స్టంట్ చేస్తుంటే అదే తరహాలో పశ్ఛిమ గోదావరి జిల్లా, నరసాపురం మండలంలోని సరిపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఎన్నికల స్టంట్ చేసిన ఎమ్మెల్యే మాధవనాయుడును మర్యాదపూర్వకంగా వెనక్కి పంపేసారు. ఇప్పుడు ఈ సంఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.టీడీపీ పై ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తుందో తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అసలు టీడీపీ వాళ్ళు ప్రజల మధ్యకు వెళ్తే ఎంత కోపం ఉందో అర్థమవుతుందని రాజకీయవేత్తలు చెప్తూనే ఉన్నారు.