Home / 18+ / సమైక్య శంఖారావాలతో వైసీపీలో జోష్.. విజయం దిశగా వైసీపీ..

సమైక్య శంఖారావాలతో వైసీపీలో జోష్.. విజయం దిశగా వైసీపీ..

మనం రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పోరాటం ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదని, ఎల్లో మీడియాతో కూడా చేస్తున్నామని, మోసగాళ్లతో యుద్ధం చేయాలన్నారు. వైసీపీకి అనుకూలంగా ఓట్లు తొలగిస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా అనంతపురం సమర శంఖారావంలో జగన్ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే.. తొమ్మిదేళ్లుగా నాతోపాటు నడిచారు. తొమ్మిదేళ్ల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికారంలో ఉన్నవాళ్లు కష్టాలు పెట్టారు. బాధలు పెట్టారు. మీరు పడిన కష్టాలు నాకు తెలుసు. మీకు జరిగిన నష్టాలు నాకు తెలుసు.

ఇక్కడకు వచ్చిన మీరు గానీ, 13జిల్లాలోని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు తొమ్మిదేళ్లు ఎలా ఉన్నారో నాకుతెలుసు. కొందరు కేసులను, అవమానాలను సహించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. కొందరు కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్న పరిస్థితులను చూశా.. మీ ప్రతి కష్టాన్ని, నష్టాన్ని చూశా. మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకు తాకిందన్నారు. మీలో ప్రతి ఒక్కరిని నేను చూసుకుంటాను. మీ బాగోగులు చూసుకుంటాను. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రకాలుగా మీ బాగోగులు చూసుకుంటానన్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా మిమ్మల్ని పైకి తెచ్చుకుంటాను.

మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందాలి. కులం చూడొద్దు, మతం చూడొద్దు. ప్రాంతం, వర్గం చూడొద్దు, రాజకీయాలు, పార్టీలు చూడకూడదు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన ప్రతి పేదవాడికి అందాలి. ఈ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించేది మీరేనన్నారు. ఈ నెలాఖరులో షెడ్యుల్‌ వస్తుందంటున్నారు. ఆ తరువాత నెల, నెలన్నరలో ఎన్నికలు జరగబోతాయి. అంటే ఈ రోజు నుంచి దాదాపు మూడు నెలల లోపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో మీ అందరిపై వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మీ అందరి భుజస్కంధాలపై ఉందన్నారు.

రాష్ట్రంలో అక్షరాల 59.18 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, ఆ బోగస్‌ ఓట్లలో తెలంగాణలో 20 లక్షలు ఉంటే.. మిగిలిన 39 లక్షలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఆ మొత్తం దొంగ ఓట్లను మనమంతా తొలగించే కార్యక్రమం చేయాలన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, మన పార్టీ మధ్య తేడా కేవలం 5 లక్షలు మాత్రమే మీరంతా మర్చిపోవద్దు. అందరూ అప్రమత్తంగా ఉండి. దొంగ ఓట్లు ఉన్న చోట ఓట్లు తొలగించే కార్యక్రమం చేయాలన్నారు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తాడు అని చెప్పండి. ప్రతీ పధకాన్ని విజయవంతంగా అమలు చేస్తానన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat