ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూసారు.1981లో డైరెక్టర్ గా కెరీర్ మొదలై 1982లో మోహన్ బాబు,చిరంజీవి,రాధిక,గీత మెయిన్ లీడ్స్ గా వచ్చిన సినిమా పట్నం వచ్చిన పతివ్రతలు అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తరువాత చిరు బాపినీడు కలయికలో ఎన్నో హిట్లు వచ్చాయి. మగమహారాజు,మహా నగరంలో మాయగాడు,హీరో,గ్యాంగ్ లీడర్ ,మగధీరుడు,ఖైదీనెంబర్ 786,బిగ్ బాస్ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.అంతే కాక కొన్ని కామెడీ సినిమాలు కూడా చేసి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.