శ్రీకాకుళం జిల్లా జే.ఆర్.పురం పోలీసు స్టేషన్‌వద్ద కలకలం రేగింది. పోలీసు స్టేషన్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గత కొంత కాలంగా జే.ఆర్.పురం పోలీసులు వేధింపులకు పాల్పడడం వల్ల సదరు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా రణస్థలం మండల కేంద్రంలో దళితులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ముందస్తుగా జేఆర్ పురం పోలీసు స్టేషన్ వద్ద పోలీసు బలగాలు మోహరించాయి.
