ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారు. అదేంటి చంద్రబాబు గారు హోదా కోసం పోరాడటం ఏమిటి.. ఆయన హోదా అంటే జైలుకు పంపుతారు కదా.. హోదా పేరెత్తితే కోపిష్టి అయిపోతారు.. హోదా ఏమైనా సంజీవనా అని ప్రశ్నిస్తారు కదా అంటే.. అవును అదంతా ఎన్డీయేలో ఉన్నపుడు.. ఇప్పుడు ఆయన యూపీఏలో ఉన్నారు.. అదీ అసలు విషయం.. మరి ఎన్డీయే నుంచి బయటకు ఎందుకు వచ్చినట్టు.. దానికీ పెద్ద కధే ఉంది.. తరచూ ఢిల్లీ వెళ్లినపుడల్లా.. హోదా కానీ, నిధులు కానీ చంద్రబాబు ఏనాడూ అడిగేవారు కాదట.. కేవలం అసెంబ్లీ సీట్ల స్థానాలు పెంచాలని, జగన్మోహన్ రెడ్డిని కుట్రపూరితంగా జైల్లో పెట్టాలని.. మాత్రమే అడిగేవారట. కానీ మోడి అన్యాయంగా తాను ఈ పని చేయలేనని, విచారణ సాగుతుంది.. కేసులు వీగిపోతున్నాయి..
ఈ సమయంలో కొత్త కేసులు పెట్టలేనని చెప్పారట.. అయితే చంద్రబాబు మాత్రం పదేపదే మోడిని విసిగించారట.. మోడి తెగేసి చెప్పడంతో పాటు ఇప్పటివరకూ ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలు అడిగేసరికి బాబు గారికి కోపం, ఆవేశం, ప్రత్యేకహోదా అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి రక్తం మరిగిపోయింది. దీంతో చేసేది లేక ఈయన కాంగ్రెస్ ను అప్రోచ్ అయ్యారట.. తాను అన్ని రాష్ట్రాలు తిరిగి అన్ని పార్టీల మద్దతు కూడగట్టి నిన్ను ప్రధానిని చేస్తాను.. నువ్వు మాత్రం కచ్చితంగా మరోసారి జగన్ ని అక్రమంగా జైల్లో పెట్టు అని కోరారట.. ఈ క్రమంలో విరిసిందే ఈ ఇరు విరుద్ధ భావాలుగల పార్టీల అక్రమ పొత్తు అంటూ సోషల్ మీడియా వేదికగా బీజేపీ శ్రేణులు చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. గతంలో కూడా ప్రధాని మోడి ఈ విషయాలను తన ప్రసంగంలో సూత్రప్రాయంగా వెల్లడించడం జరిగింది.