Home / ANDHRAPRADESH / కర్నూల్ జిల్లాలో టీడీపీ ఓడిపోయే ఫస్ట్ సీట్ ఇదే..భారీ మెజార్టీతో వైసీపీ విజయం..!?

కర్నూల్ జిల్లాలో టీడీపీ ఓడిపోయే ఫస్ట్ సీట్ ఇదే..భారీ మెజార్టీతో వైసీపీ విజయం..!?

వైఎస్ జగన్ వర్గం బలంగా ఉన్న జిల్లా, గత ఎన్నికల్లో టీడీపీని ఆదరించని జిల్లాల్లో ఒకటైన జిల్లా, ఒకరకంగా చెప్పాలి అంటే వైఎస్ జగన్ కి కంచుకోటల్లో ఒకటైన జిల్లా…అదే కర్నూల్ జిల్లా. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ఎత్తులు, పైఎత్తుల్లో బిజీగా ఉంటున్నాయి. ఏఏ సీట్లలో పార్టీ పరిస్థితి ఏంటి.. నేతల స్టామినా ఏంటి లాంటి లెక్కలతో కుస్తీ పడుతున్నాయి. ఎక్కడ ఎవర్ని నిలబెడితే గెలుపు ఖాయమో సర్వేలు చేయించుకుంటున్నాయి. అయితే సర్వేలతో సంబంధం లేకుండా కర్నూల్ జిల్లాలోని పత్తికొండ నియోజక వర్గంలో ఎవ్వరు పోటి చేసిన టీడీపీ ఓ సీటును పోగొట్టుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. 1994 నుంచి పత్తికొండ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతూ వస్తూనే ఉన్నారు. అయితే 2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ఎస్వీ సుబ్బారెడ్డికి ఇబ్బందులు తెచ్చిపెట్టగా కేఈ కుటుంబానికి కలసి వచ్చింది. పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి, కృష్ణగిరి తో పాటు డోన్ నియోజకవర్గంలో ఉన్న మూడు గ్రామాలను కలపి తుగ్గలి మండలాలనను పత్తికొండ నియోజకవర్గంలోచేరారు. పత్తికొండ, మద్దికేర మండలాలను యధాతథంగా ఉంచారు. డోన్ నియోజకవర్గంలో అప్పటి వరకూ ఉన్న కృష్ణగిరి మండలం పత్తికొండలో కలవడంతో కేఈ కుటుంబం బలం పెరిగింది. అయితే ఈ నియోజక వర్గంలో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు.

గత ఎడాది తుగ్గలి మండ‌లంలో టీడీపీ నియోజవర్గ ఇన్‌చార్జ్‌ కేఈ శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన మినీ మహానాడులో కేఈ ప్రభాకర్ ఘాటుగా మాట్లాడడంతో ప్రతిగా నాగేంద్ర..‘‘ఏయ్‌ మాట్లాడే విధానం నేర్చుకో భూస్థాపితం అవుతావు’’ అని హెచ్చరించారు. ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగి పెను దూమారం రేపాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు నియోజక వర్గంలో నాగేంద్ర, కెయి ఫ్యామీలీకి సఖ్యత లేదని సమచారం.ఇటీవల్లనే తుగ్గలి నాగేం‍ద్రకు సంబంధించిన ఆస్తుల మీద దాడి జరిగింది. నాగేంద్ర రైల్వే పనులకు ఉపయోగిస్తున్న రెండు టిప్పర్లు, నాలుగు హిటాచీ వాహనాలను ధ్వంసం చేయడమే కాక పని వారి మీద కూడా దాడి చేశారు. ఆ దాడి చేసింది కెయి వారు అని నాగేంద్ర మీడియా ముందు తెలిపారు. ఇలా నియోజక వర్గంలో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటు వైసీపీ బలాన్ని పెంచారు. 2009 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తికి పత్తికొండ టిక్కెట్ ను ఇచ్చిన అధిష్టానం ఎస్వీ సుబ్బారెడ్డిని పక్కన పెట్టింది. అప్పటి నుంచి వరుసగా రెండుసార్ల నుంచి కేఈ కృష్ణమూర్తి గెలుపొందుతూ వస్తున్నారు. అయితే ఈసారి కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారు. ఆయన తనయుడు కేఈ శ్యాంబాబును అభ్యర్థిగా నిలబెట్టనున్నారు. ఇప్పటికే కేఈ కృష్ణమూర్తి మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసి కేఈ శ్యాంబాబును గెలిపించాలని కోరుతున్నారు. అయితే కేఈ శ్యాంబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇదే నియోజక వర్గంలో వైసీపీ నుండి చెరుకులపాడు శ్రీదేవిని జగన్ తన పాదయాత్ర సమయంలో తొలి అభ్యర్థిగా ప్రకటించారు. నారాయణరెడ్డి హత్యతో శ్రీదేవి పై సానుబూతి పెరిగింది. ఇప్పటికే ఆమె నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను రెండు సార్లు పర్యటించి వచ్చారు. దీనికి తోడు ఇన్నాళ్లూ కేఈ కుటుంబానికి అండగాఉన్న రాష్ట్ర శాలివాహన ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత తుగ్గలి నాగేంద్ర తో విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ కారణాలన్నీ శ్రీదేవి విజయానికి కారణమవుతాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మొత్తం మీద ఈసారి కర్నూల్ జిల్లాలో టీడీపీ ఓడిపోయే ఫస్ట్ సీట్ పత్తికొండ అని తెలుస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat