ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ నగరంలోని జలవిహార్ లో ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకను అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు అయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ఆయుష్ హోమం, చండీయాగం, గణపతి హోమం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆయన విడుదల చేశారు.